శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా చవల్గామ్ ప్రాంతంలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతందని కశ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపగా.. వాటిని బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.