న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ నినాదాలు ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఆదివారం ప్రత్యక్షమయ్యాయి. త్వరలో ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనున్న నేపథ్యంలో తాజా ఘటన కలకలం రేపుతున్నది. పశ్చిమ ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్ కేంద్రాల వద్ద గోడలపై ‘ఖలిస్థాన్ రిఫరెండం జిందాబాద్’ అనే నినాదాల్ని రాశారు. మరోవైపు కెనడాలోని సుర్రేలో ఖలిస్థాన్ అనుకూల రిఫరెండం చేపడతామని ప్రకటిస్తూ ఎస్ఎఫ్జే నాయకుడు గురుపత్వంత్ సింగ్ ఓ వీడియో విడుదల చేశాడు.