న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశంలో నిరుద్యోగిత రేటు అక్టోబర్లో7.77 శాతం ఉండగా, నవంబర్లో 8 శాతానికి పెరిగింది. గత మూడు నెలల్లో ఇదే అత్యధికం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ విషయం వెల్లడించింది.
పట్టణ నిరుద్యోగిత రేటు అక్టోబర్లో 7.21 శాతం ఉండగా, నవంబర్లో 8.96 శాతానికి పెరిగింది. గ్రామీణ నిరుద్యోగం మాత్రం 8.04 శాతం నుంచి 7.55 శాతానికి తగ్గింది. ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణం పెరుగుదల భయాల నేపథ్యంలో నిరుద్యోగిత రేటు పెరుగడం కలవరపరుస్తున్నది.