Man kills mother for insurance | ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై అప్పుల పాలైన వ్యక్తి.. బీమా డబ్బు కోసం తల్లిని హత్య
Man kills mother for insurance | ఒక వ్యక్తి ఆన్లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడంతో బంధువైన మహిళకు చెందిన నగలు చోరీ చేశాడు. వాటిని అమ్మి ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద ఇన్సురెన్స్ పాలసీలు కొన్నాడు.
లక్నో: ఒక వ్యక్తి ఆన్లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడంతో బంధువైన మహిళకు చెందిన నగలు చోరీ చేశాడు. వాటిని అమ్మి ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద ఇన్సురెన్స్ పాలసీలు కొన్నాడు. బీమా డబ్బుతో అప్పులు తీర్చేందుకు తల్లిని హత్య చేశాడు. (Man kills mother for insurance) ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హిమాన్షు అనే వ్యక్తి జూపీ అనే యాప్‌లో ఆన్లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. పదేపదే నష్టపోవడంతో అప్పులు చేశాడు. వాటిని చెల్లించేందుకు స్నేహితుల నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు.
కాగా, డబ్బు తిరిగి ఇవ్వాలని హిమాన్షుకు స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో గత ఏడాది డిసెంబర్లో మేనత్త నగలు చోరీ చేశాడు. ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద రూ.50 లక్షల చొప్పన ఇన్సూరెన్స్ పాలసీలు కొన్నాడు. బీమా డబ్బుతో అప్పులు తీర్చాలని భావించాడు. తండ్రి రోషన్ సింగ్ ఇటీవల చిత్రకూట్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా 50 ఏళ్ల తల్లి ప్రతిభను కుమారుడు హిమాన్షు హత్య చేశాడు. శవాన్ని మూటకట్టి ట్రాక్టర్లో తీసుకెళ్లాడు. తల్లి మృతదేహాన్ని యమునా నదిలో పడేశాడు.
మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన రోషన్ సింగ్, తన భార్య, కుమారుడు కనిపించకపోవడంతో స్థానికులు, బంధువులను ఆరా తీశాడు. హిమాన్షు ట్రాక్టర్‌తో నది తీరంలో కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 21న పోలీసులను అలెర్ట్ చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. హిమాన్షును ప్రశ్నించగా తల్లిని హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

