అహ్మదాబాద్ : నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి కూలిన ఘటన బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు. నాణ్యతా లోపం కారణంగానే బ్రిడ్జి కూలినట్టు భావిస్తున్నారు.
జాతీయ రహదారి 48కు కి.మీ దూరంలో ఉన్న అడాస్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆర్వోబీకి చెందిన ఒక స్తంభం రాత్రి 7.30 గంటలకు పెద్ద శబ్దంతో పడిపోయింది. దీంతో పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని తదుపరి ప్రమాదం జరగకుండా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు.