Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్(Tarique Rahman) భారత పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఆగస్టు చివరి వారంలో రెహ్మాన్ ఇండియాకు రావాల్సి ఉండగా.. అధికారికంగా మాత్రం ఆయన రాకపై ఇంకా స్పష్టత లేదు. బంగ్లా ప్రధాని పర్యటనకు సంబంధించి తమవద్ద తాజా సమాచారం లేదని శుక్రవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ మీడియాతో పేర్కొన్నారు.
దౌత్య సంబంధాల బలోపేతం కోసం బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తొలిసారి భారత్‌లో పర్యటిస్తారనే వార్తలు వినిపిస్తున్నా షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. ఢిల్లీకి బంగ్లా ప్రధాని వస్తున్నారా? అనే ప్రశ్నకు శుక్రవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ‘నావద్ద సమాచారం లేదు’ అని చెప్పారు. ‘బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటనపై నేను చెప్పాల్సిందేమీ లేదు. తాజా సమాచారం ఏదైనా ఉంటే నేను మీకు తెలియజేస్తాను’ అని జైస్వాల్ వెల్లడించారు.
An email to the media by the Rashtrapati Bhavan on Friday (August 21, 2026) briefly created the impression that the long-under-discussion visit of Bangladesh Prime Minister Tarique Rahman would take place soon. The email sent in the afternoon was headlined, “No change of guard…
— The Hindu (@the_hindu) August 22, 2026
అంతకుమందు.. రాష్ట్రపతి నిలయం కూడా తారిఖ్ రెహ్మాన్ రాకను ధ్రువీకరించలేదు. బంగ్లా ప్రధానికి స్వాగత సన్నాహకాల్లో భాగంగా నిర్వహించే చేంజ్ ఆఫ్ గార్డ్ రిహార్సల్స్‌ను అధికారులు రద్దు చేశారు. అంతేకాదు రెహ్యాన్ భారత పర్యటన ఉంటుంది అని పేర్కొన్ని రాష్ట్రపతి భవన్ కాసేపటికే తమ ప్రకటనను వెనక్కి తీసుకుంది. దాంతో.. ఈ నెలాఖరున తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనపై నెలకొన్న అనిశ్చితికి తెరపడలేదు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23, 24వ తేదీల్లో బంగ్లా ప్రధాని ఇండియాలో పర్యటించాలి.