న్యూఢిల్లీ : తనను బంగ్లాదేశీగా ముద్ర వేసిన అస్సాం ప్రభుత్వంపై ఓ మహిళ ఆరేండ్లు పోరాడి భారత పౌరసత్వాన్ని పొందారు. కచర్ జిల్లాకు చెందిన డులుబి బీబీతో పాటు ఆమె పూర్వీకుల పేర్లు ఓటర్ల జాబితాల్లో పొంతన లేకుండా ఉండటంతో ఫారినర్స్ ట్రైబ్యునల్ 2017లో ఆమెను బంగ్లాదేశ్ వ్యక్తిగా ప్రకటించింది.
పలు సంవత్సరాల ఓటర్ల జాబితాలు, బీబీ సమర్పించిన పత్రాలు, సాక్ష్యా ధారాలను పరిగణనలోకి తీసుకుని ఆమె భారత పౌరురాలేనని గుర్తించినట్లు ఫారినర్స్ ట్రైబ్యునల్ ఈనెల 10న తెలిపింది.