దుబాయ్: ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ ఏజెన్సీల సిబ్బందిని హౌతీ రెబల్స్ నిర్బంధించారు. వీరి నిర్బంధంలో 9 మంది యెమెన్ ఉద్యోగులు, ఇతరులు ఉన్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు వైమానిక దాడులు చేస్తుండటంతో హౌతీ రెబల్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వీరి నిర్బంధంలో ఉన్నవారిలో సహాయక బృందాల సభ్యులు కూడా ఉండి ఉండవచ్చునని తెలిపారు. ఈ రెబల్స్ ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలపై దాడులు చేస్తూ ఉంటారు.