కీవ్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో సాధారణ ఎన్నికలను సక్సెస్ఫుల్గా నిర్వహించడం పట్ల స్వాగతం పలుకుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelenskyy) తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడవసారి విజయాన్ని నమోదు చేయడం పట్ల ప్రధాని మోదీకి ఆయన కంగ్రాట్స్ తెలిపారు. శాంతి, సౌభాత్రుత్వంలో భారత ప్రజలు వర్ధిల్లాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగాలని భావిస్తున్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. భారత్, ఉక్రెయిన్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని, మన భాగస్వామ్యం కొనసాగాలని, ఇరు దేశాలు పురోగతి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యవహారాల్లో భారత ప్రాముఖ్యతను అన్ని దేశాలు గుర్తిస్తాయని, అన్ని దేశాల శాంతి కోసం అందరం కలిసి పనిచేయాలన్నారు. శాంతి సదస్సులో ఇండియా పాల్గొవాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
I welcome the successful holding of the world’s largest democratic elections in India. Congratulations to Prime Minister @NarendraModi, the BJP, and BJP-led NDA on the third consecutive victory in India’s parliamentary elections.
I wish the people of India peace and prosperity,…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 5, 2024