న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం కింద తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఆఫ్‌షోర్ క్యాంపస్ గురుగ్రామ్‌లో ఏర్పాటు కాబోతున్నది. బ్రిటన్‌కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ దీనిని ఏర్పాటు చేస్తుందని కేంద్రం గురువారం తెలిపింది. దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ని విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ వర్సిటీ ప్రతినిధులకు అందజేశారు.
మన దేశంలోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఇచ్చే డిగ్రీలు బ్రిటన్‌లో ఆ విశ్వవిద్యాలయం ఇచ్చే డిగ్రీలతో సమానమైనవేనని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. విద్య, నాణ్యత ప్రమాణాలు సమానంగా ఉంటాయన్నారు.