నేడు భారత్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్‌కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో భారత్‌కు రానున్నారు. గురువారం లండన్ నుంచి నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంటారు.
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్‌కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో భారత్‌కు రానున్నారు. గురువారం లండన్ నుంచి నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ పారిశ్రామిక, వ్యాపారవేత్తలో సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది. అనంతరం ఢిల్లీ పయణమవుతారు.

శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రక్షణ, వాణిజ్య బంధాలు, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత సహా పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవశకాశం ఉన్నది. ఇరు దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడం, వ్యూహాత్మక రక్షణ రంగ చర్యలు, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం.. లాంటి విషయాలపై చర్చించనున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా బోరిస్ జాన్సన్ గతేడాది రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

