e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News డెల్టా వేరియంట్ పై కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన నిపుణులు

డెల్టా వేరియంట్ పై కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన నిపుణులు

డెల్టా వేరియంట్ పై కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన నిపుణులు

లండ‌న్ : భార‌త్ లో తొలుత గుర్తించిన డెల్టా వేరియంట్ (బీ1.617.2) బ్రిట‌న్ లో వెలుగుచూసిన ఆల్ఫా స్ట్రెయిన్ తో పోల్చితే 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుంద‌ని యూకే ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. డెల్టా వేరియంట్ పై వ్యాక్సిన్ సామ‌ర్ధ్యం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ని బ్రిట‌న్ ఆరోగ్య నిపుణులు శుక్ర‌వారం పేర్కొన్నారు. ప్ర‌తివారం వేరియంట్ ఆఫ్ క‌న్స‌ర్న్ (వీఓసీ)లను ప‌ర్య‌వేక్షించే ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) డెల్టా వేరియంట్ పై కీల‌క వివ‌రాలు వెల్ల‌డించింది.

బ్రిట‌న్ లో వెలుగుచూస్తున్న తాజా కొవిడ్ కేసుల్లో 90 శాతానికి పైగా డెల్టా వేరియంట్ కు చెందిన‌వేన‌ని పీహెచ్ఈ తెలిపింది. ఆల్ఫా వేరియంట్ తో పోలిస్తే డెల్టా వేరియంట్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వ్యాప్తి చెందే ముప్పు 60 శాతం అధిక‌మ‌ని పీహెచ్ఈ తాజా ప‌రిశోధ‌న స్ప‌ష్టం చేసింది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య కేవ‌లం 4.5 రోజుల నుంచి 11.5 రోజుల మ‌ధ్య రెట్టింప‌వుతాయ‌ని అంచ‌నా వేసింది. ఆల్ఫా వేరియంట్ తో పోలిస్తే డెల్టా వేరియంట్ నుంచి వ్యాక్సిన్ ర‌క్ష‌ణ త‌క్కువ‌గా ఉంద‌ని పేర్కొంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డెల్టా వేరియంట్ పై కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన నిపుణులు

ట్రెండింగ్‌

Advertisement