Kadhi Pakoda | దేశీ మెయిన్ కోర్స్ అనగానే కధి పకోడా భోజన ప్రియుల నోరూరిస్తుంది. శనగపిండితో చేసే ఈ టేస్టీ కర్రీని ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. అయితే ఈ రెసిపీని ఓ విదేశీయుడు తయారుచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బ్రిటిష్ చెఫ్ జేక్ డ్రైన్ ఇటీవల ఇండియన్ డిష్ ప్రిపరేషన్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వీడియోను వీక్షించిన దేశీ ఫుడ్ లవర్స్ కామెంట్స్ సెక్షన్లో జేక్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఇక జేక్ తన వీడియోలో తొలుత శనగపిండిలో మజ్జిగ ఇతర స్పైసెస్ను యాడ్ చేసి మిక్స్ చేయడం కనిపిస్తుంది. ఆపై స్టవ్ మీద పాత్రను ఉంచి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలు, అల్లం, మెంతులు, ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాడు.
ఇది సిద్ధం అయిన తర్వాత మజ్జిగ, శనగపిండిలో వాటిని కలిపి ఆపై పకోడాలను వేయించి ఆ మిశ్రమంలో జోడిస్తాడు. జేక్ కుకింగ్ నైపుణ్యాలపై దేశీ నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. రైస్‌తో కధి పకోడా నా కంఫర్ట్ ఫుడ్స్‌లో ఒకటని ఓ యూజర్ కామెంట్ చేయగా ఇది అసలైన దేశీ కధి పకోడా అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇది చాలా యమ్మీగా ఉందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Uma Bharti | రామమందిరం ప్రాణప్రతిష్ఠ.. ఉద్వేగానికి లోనైన ఉమాభారతి