ఫేక్ వర్సిటీలతో జాగ్రత్త!
ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో అందుకోసం విద్యాసంస్థను ఎంచుకొనే విషయంలో, అడ్మిషన్ తీసుకొనే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచించింది.
- అడ్మిషన్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
- విద్యార్థులు, తల్లిదండ్రులకు యూజీసీ సూచన
- నకిలీ వర్సిటీల లిస్టు విడుదల
న్యూఢిల్లీ: ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో అందుకోసం విద్యాసంస్థను ఎంచుకొనే విషయంలో, అడ్మిషన్ తీసుకొనే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచించింది. నకిలీ కాలేజీ, యూనివర్సిటీల ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరించింది. అడ్మిషన్ల సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 21 ఫేక్ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధికంగా ఢిల్లీలో ఎనిమిది యూనివర్సిటీలు ఉన్నాయి.
రాష్ర్టాల వారీగా ఫేక్ వర్సిటీలు
ఢిల్లీ
1.ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్
2.కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్
3.యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ
4.ఏడీఆర్-సెంట్రిక్ జ్యురిడికల్ వర్సిటీ
5.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
6.విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ సెల్ఫ్-ఎంప్లాయిమెంట్
7.ఒకేషనల్ యూనివర్సిటీ
8.ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ
ఉత్తరప్రదేశ్
1.గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్, అలహాబాద్
2.నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ(ఓపెన్ యూనివర్సిటీ), అచ్చల్తాల్, అలీగఢ్
3.భారతీయ శిక్షా పరిషత్, లక్నో
4.మహమయ టెక్నికల్ వర్సిటీ, నోయిడా
ఆంధ్రప్రదేశ్
1.క్రిస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, గుంటూరు
2.బిబ్లే ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం
కేరళ
1.సెయింట్ జాన్స్ వర్సిటీ, కిషనట్టం
2.ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్(ఐఐయూపీఎం), కున్నమంగళం, కోజికోడ్
పశ్చిమబెంగాల్
1.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా
2.ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రిసెర్చ్, కోల్‌కతా
కర్ణాటక
1.బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ వర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకక్, బెల్గాం
మహారాష్ట్ర
1.రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్‌పుర్
పుదుచ్చేరి
1.శ్రీబోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

