న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూజీసీ నెట్ (జూన్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గురువారం ప్రకటించింది. అక్టోబర్ 10న ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు, తాజాగా స్కోర్ కార్డులను తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్లోకి వెళ్లి తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.