న్యూఢిల్లీ, డిసెంబర్ 21: యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) డిసెంబర్-2024 విడత పరీక్షలు జనవరి 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది.
సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పీహెచ్డీ ప్రవేశాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)కు అర్హతగా నెట్ పరీక్షను నిర్వహిస్తారు.