తిరువనంతపురం: కేరళ(Kerala) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ కూటమి దూసుకెళ్తున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సుమారు 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇక ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రస్తుతం ధర్మాదం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి యూడీఎఫ్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ సుమారు రెండు వేల ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లలో యూడీఎఫ్ మెజారిటీ స్పష్టంగా కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లే కేరళ రిజల్ట్స్ రానున్నట్లు తెలుస్తోంది. రౌండ్లు సాగుతున్నా కొద్దీ.. యూడీఎఫ్ ముందజలో కొనసాగుతున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేకర్ ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్నారు. మంజేశ్వరం నుంచి బీజేపీ నేత కే సురేంద్రన్ కూడా లీడింగ్‌లో ఉన్నారు. ఎల్డీఎఫ్ నేతలకు భారీ జలక్ తగిలింది. పినరయి విజయన్‌కు చెందిన బృందం అన్ని చాలా వరకు నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వీఎన్ వాసన్, ఆర్ బిందు, వీణా జార్జ్, జే చించు రాణి, రామచంద్రన్ కదన్నపల్లి, ఎంబీ రాజేశ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.