ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. సోమవారం వానీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యవత్మాల్లోని హెలిప్యాడ్‌లో దిగిన హెలికాప్టర్‌లోని ఉద్ధవ్ బ్యాగులను ఈసీ అధికారులు చెక్ చేశారు. ఈ సందర్భంగా వారిపై ఆయన మండిపడ్డారు. తన యూరిన్ పాట్, హెలికాప్టర్‌లోని ఫ్యూయల్ ట్యాంక్‌ను కూడా చెక్ చేయాలంటూ ఎగతాళి చేశారు. దీనిని వీడియో తీస్తున్నట్లు ఈసీ అధికారులతో అన్నారు. ‘నా బ్యాగులు చూసే ముందు మీరు ఏ రాజకీయ నేతల బ్యాగులను తనిఖీ చేశారు? ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్, మోదీ, అమిత్ షా బ్యాగ్‌లను మీరు చెక్ చేశారా? మోడీ బ్యాగ్‌లను తనిఖీ చేసిన వీడియోను నాకు చూపించండి. నేను దీనిని వీడియో తీస్తున్నా’ అని అన్నారు.
కాగా, ఈ సంఘటన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అధికారులు తన బ్యాగులను చెక్ చేయడంపై తాను కలత చెందలేదని తెలిపారు. అయితే తన బ్యాగులను తనిఖీ చేసిన విధంగానే మోదీ, అమిత్ షా బ్యాగులను తనిఖీ చేశారా? సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ బ్యాగులను కూడా తనిఖీ చేయాలి కదా అని అధికారులను ప్రశ్నించారు. ‘మీరు మీ బాధ్యతను పాటిస్తున్నారు. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తా’ అని వారితో అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उद्धव ठाकरे आज वणीमध्ये संजय देरकर यांच्या प्रचारासाठी पोहोचल्यानंतर हेलिकॉप्टरमध्ये उतरताच निवडणूक अधिकाऱ्यांनी बॅगेची तपासणी केली. #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/wZPpGvGXju
— Girish Kamble (@GirishKamble22) November 11, 2024