ముంబై: మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), ప్రకాశ్ అంబేద్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ జతకట్టాయి. రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీరు కూటమిగా ఏర్పడటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ తమ తాత కేశవ్ ఠాక్రే, ప్రకాశ్ అంబేద్కర్ తాత బీఆర్ అంబేద్కర్ ఇద్దరూ సామాజిక న్యాయం, సమాజం కోసం పోరాడారని చెప్పారు. కానీ ప్రస్తుత సమాజంలో నీచ రాజకీయాలు నడుస్తున్నాయని, వీటిని పెకిలించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు.