Uddhav Thackeray | శివసేన (UBT) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం ఆసుపత్రిలో చేరారు. గతంలో ఆయన యాంజియోప్లాస్టీ చేసుకున్నారు. తాజాగా ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం రియలన్స్ ఆసుప్రతిలో చేరి.. ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 12న విజయదశమి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలోని ఆయన మహారాష్ట్ర సర్కారుతో పాటు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ఉద్ధవ్ ఠాకే 2012 జూలై 20న ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. గుండెలోని మూడు ప్రధాన ధమనుల్లో ఎనిమిది స్టంట్స్ వేశారు. తాజాగా ఒంట్లో బాగాలేకపోవడంతో రిలయన్స్ ఆసుపత్రికి చేరుకొని పరీక్షలు చేయించుకున్నారు.