ముంబై: జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే నాయకత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టుకున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అందుకుగానూ ఒక్కో ఎమ్మెల్యే సుమారు రూ.50 కోట్లు తీసుకున్నట్టు ఆరోపించారు. ద్రోహులకు గుర్తుగా జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా గుర్తించాలని ఆయన ఐరాసను కోరారు.