న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన వినోద్ మొబైల్ కీబోర్డ్‌పై ముక్కుతో ఆంగ్ల వర్ణమాలను వేగంగా టైప్ చేసి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు 21వసారి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 19 రికార్డులను అధిగమించాడు.
ఢిల్లీలోని కిరాడీకి చెందిన వినోద్ కుమార్ చౌదరిని అక్కడివారు టైపింగ్ మ్యాన్‌గా పిలుచుకుంటారు. ముక్కు తో మొబైల్ కీబోర్డ్‌పై 108 ఆంగ్ల అంక్షరాలను ఒక నిమిషం 18 సెకన్లలో టైప్ చేయగలిగాడు. కండ్లకు గంతలు కట్టుకొని, మౌత్ స్టిక్‌తో టైపింగ్‌లో వినోద్ రికార్డులు నెలకొల్పాడు.