Viral news : సోషల్ మీడియా వేదికగా నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్యర్యకరంగా ఉంటాయి. కొన్ని భయపెట్టేవిగా ఉంటే.. మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అలాంటిదే ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళలు పడిపోతామన్న భయంతో ఓ మెట్రో స్టేషన్ ఎస్కలేటర్‌లో వెళ్లిన తీరు తెగ నవ్విస్తున్నది.
ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలు ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చింది. దాంతో వాళ్లు భయపడిపోయారు. దానిపై కాలు పెడితే పడిపోతామేమో అనే భయంతో కాసేపు సంకోచించారు. చివరికి ఎలాగోలా ధైర్యం చేసి ఎస్కలేటర్‌పైకి ఎక్కారు. కానీ ఆ ఎస్కలేటర్‌పై వాళ్లు ప్రయాణించిన తీరు మాత్రం వీడియో చూసిన వాళ్ల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా మంది వీక్షించారు. కొన్ని వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పుడు నేను మొదటిసారి షాపింగ్ మాల్కి వెళ్లింది గుర్తుకొస్తోంది అని ఓ నెటిజన్ స్పందిస్తే.. అమ్మో.. గతం గుర్తుకొస్తోంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Tf why?💀😭
pic.twitter.com/sHDAqeGIV1— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024