ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపాల్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు.. వందేమాతరం(Vande Mataram) గీతాన్ని ఆలపించని విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం సమయంలో జాతీయ గీతం వందేమాతరాన్ని పాడేందుకు నిరాకరించారు. ఏప్రిల్ 8వ తేదీన ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్ ఫౌజియా షేక్ ఆలిమ్ వందేమాతర గీతం పాడేందుకు వ్యతిరేకించారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం ఆ పాట పాడలేనని చెప్పిందామె. మరో కాప్పొరేటర్ రూబినా ఇక్బాల్ ఖాన్ కూడా ఫౌజియాకు మద్దతు పలికింది. స్వతంత్ర్య కార్పొరేటర్‌గా గెలిచిన రూబినా ఆ తర్వాత కాగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ ఇద్దరు జాతీయ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించారు. బీజీరోడ్డ పోలీసు స్టేషన్లో 196 బీఎన్ఎస్ సెక్షన్ కింద ఫౌజియా, రుబినాపై కేసు నమోదు అయ్యింది. ఆ ఇద్దరికీ సమన్లు ఇచ్చిన పోలీసులు గడిచిన రెండు రోజుల పాటు వారిని విచారించారు. వారి వద్ద నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగ్నిజల్ అఫెన్స్‌గా భావిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. సమగ్రరీతిలో ఈ కేసును విచారిస్తున్నట్లు చెప్పారు.