లక్నో: కోర్టుకు హాజరైన అక్కాచెల్లెళ్లు నడుస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు వారి మీద నుంచి దూసుకెళ్లింది. (Sisters Run Over By Speeding Car) దీంతో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఈ సంఘటన జరిగింది. భర్తతో వివాదంలో ఉన్న సిమ్రాన్ తన చెల్లితో కలిసి ఆవాస్ వికాస్ కాలనీలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నది. శుక్రవారం సోదరితో కలిసి కోర్టుకు హాజరైంది. కేసు వాయిదా పడటంతో ఇద్దరు సిస్టర్స్ నడుస్తూ వారి ఇంటికి వెళ్తున్నారు.
కాగా, వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అక్కాచెల్లెళ్లను ఢీకొట్టింది. దీంతో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన సిస్టర్స్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని భర్త, ఇంటి నుంచి బయటకు రావద్దని బామ తమని హెచ్చరించినట్లు సిమ్రాన్ ఆరోపించింది. బావ కారుతో తమని ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారును గుర్తించారు. భర్తతో పాటు ఆమె సోదరులతో కూడా సిమ్రాన్‌కు గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరానికి ఉపయోగించిన కారు సోదరుడు వాహిద్ అత్తమామల కుటుంబ సభ్యుడిగా గుర్తించినట్లు చెప్పారు. దీంతో సిమ్రాన్ సోదరుడు వాహిద్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
यूपी के बुलंदशहर में दो लड़कियों को गाड़ी से रौंदने का वीडियो वायरल ! pic.twitter.com/y2eQzBhruc
— Rahul Chaudhary (@rchaudhary_) August 17, 2024