Encounter: కాంచీపురంలో ఇద్దరు రౌడీషీటర్ల కాల్చివేత..
Rowdies Shot Dead: కాంచీపురంలో ఇవాళ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు రౌడీలను పోలీసులు కాల్చి చంపారు. మంగళవారం జరిగిన ఓ మర్డర్ కేసులో ఆ ఇద్దరూ నిందితులే.
చెన్నై: తమిళనాడులోని శక్తిపీఠ క్షేత్రం కాంచీపురంలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్(Encounter) జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీషీటర్లను ఇద్దరు పోలీసులు కాల్చివేశారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారిలో రఘువరన్, కరుప్పు హసన్ ఉన్నారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద ఆ ఇద్దరి రౌడీలను కాల్చివేశారు. తెల్లవారుజామున 3.30 నిమిషాలకు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఓ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న ఆ ఇద్దర్నీ పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఓ బిల్డింగ్లో దాచుకున్న ఆ నలుగురూ.. పోలీసులపై అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభాకరన్ అనే ఏ-ప్లస్ రౌడీషీటర్ హత్య కేసులో ఆ ఇద్దరూ నిందితులు. ప్రభాకరన్పై సుమారు 20 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతన్ని మంగళవారం మర్డర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

