న్యూఢిల్లీ: విదేశీ గడ్డపై నుంచి నేర సామ్రాజ్యాలు ఏలుతున్న భారత్కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు వెంకటేష్ గర్గ్, భాను రాణాలను భారతీయ భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. గర్గ్ని జార్జియాలో, రాణాను అమెరికాలో అరెస్టు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. త్వరలోనే ఈ ఇద్దరినీ భారత్కు తరలించనున్నట్లు వారు చెప్పారు.
హర్యానాలోని నారాయణ్గఢ్కి చెందిన వెంకటేష్ గర్గ్ భారత్ నుంచి పరారై జార్జియాలో నివసిస్తున్నాడు. ఇక హర్యానాలోని కర్నల్కు చెందిన భాను రాణా చాలాకాలంగా పేరు మోసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులో పనిచేస్తున్నాడు.