కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 1: మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(నక్సలైట్లు) మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు సమావేశమవుతున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సుమారు 500 మంది సాయుధ బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు.