శనివారం 19 సెప్టెంబర్ 2020
National - Jun 25, 2020 , 19:49:53

చైనా రసాయనం వినియోగిస్తున్న ఇద్దరి అరెస్టు

చైనా రసాయనం వినియోగిస్తున్న ఇద్దరి అరెస్టు

సంభాల్‌ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభాల్‌ జిల్లాలో మామిడి కాయలను పక్వానికి తెచ్చేందుకు చైనా రసాయనాన్నివినియోగిస్తున్న ఇద్దరిని ఆహార భద్రతా అధికారులు గురువారం అరెస్టు చేశారు. సంభాల్‌ జిల్లా గున్నార్‌ పట్టణంలోని నెహ్రూ చైక్‌ వద్ద మార్కెట్‌లో ఉదయం అధికారులు తనిఖీ నిర్వహించారు. ఇద్దరు వ్యాపారులు మామిడి కాయలు పక్వానికి రావడానికి చైనా రసాయనం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల గాల్వాన్‌ లోయలో చైనా దళాలు-భారత సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో 20మంది జవాన్లు వీరమరణం పొందడంతో దేశంలో చైనా వస్తువులపై నిరసనలు వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇక్కడ చైనా రసాయనం పట్టుబడడంతో స్థానిక యువత చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. జీజిన్‌పింగ్‌ చిత్రపటాలను తగులబెట్టి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అహ్మాదాబాద్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఇదే తరహా నిరసనలు వ్యక్తమయ్యాయి.logo