ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు ..ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి?
కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దుర్దా పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ భద్రతాబలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ క్రమంలో ఉదయం సుమారు 6గంటల సమయంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. ఇరువర్గాల మధ్య సుమారు ఇరవై నిమిషాల పాటు భీకర పోరు జరిగినట్లు తెలుస్తోంది.

కాల్పుల విరమణ అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపులు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఘటనాస్థలంలో ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధ, వస్తు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనపర్చుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బీజాపూర్ పోలీస్ ఉన్నతాధికారులు అధికారికంగా ధృవపర్చాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

