Manipur Violence | ఇంఫాల్, సెప్టెంబర్ 8: మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం తెంగ్నోపాల్ జిల్లాలోని పల్లెల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, 50 మంది గాయపడినట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో నలుగురు బుల్లెట్ల వల్ల గాయపడ్డారు.
పల్లెల్లో ఉదయం ఆరు గంటలకు గుర్తు తెలియని రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇందులో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరో ఘటనలో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 48 ఏండ్ల వ్యక్తి మృతిచెందగా, పరిస్థితిని అదుపులోకి తేవడానికి అస్సాం రైఫిల్స్ బలగాలు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ వల్ల 45 మంది మహిళలు గాయపడ్డారు.