హైదరాబాద్ : రాజస్థాన్లోని కోటా (Kota) తల్వాండి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకంది. శనివారం రాత్రి మూడంతస్తుల భవనం(Three-storey building) కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసి దవాఖానకు తరలించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా, తల్వాడిలోని భవనంలో కోచింగ్ సెంటర్లతో పాటు మూడు రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. షాపు లోపల కస్టమర్లు , సిబ్బంది ఉండగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.