లక్నో: ఇద్దరు అమ్మాయిలు (School Girls) ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆలస్యంగానైనా విషయం వారికి తెలిసింది. ఇంకేముంది నా లవర్ను వల్లో వేసుకుంటామా అంటూ జుట్లుజుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. వారిని ఆపేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలించలేదు. చివరికి పెద్దలు జోక్యం చేసుకుని అతి కష్టంమీద వారిద్దరిని విడిపించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బాఘ్పట్ జిల్లా సరాయ్ ప్రాంతంలో జరిగింది.
సింఘౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాయ్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్కు చెందిన ఇద్దరు అమ్మాయిలు.. అదే పాఠశాలలో చదువుతున్న ఒకే అబ్బాయిని ప్రేమించారు. తామిద్దరం ఒక్కడినే ప్రేమిస్తున్నామని తెలుసుకున్న వారు.. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ గొడవకు దిగారు. స్కూల్ యూనిఫామ్ ఉన్నామన్న విషయాన్ని మరికి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. తోటి విద్యార్థినులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా వారి తరం కాలేదు. దీంతో ఇదంతా చూస్తున్న స్థానికులు వారిని విడిపించారు. విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. ఇదంతా అక్కడి ఓ షాప్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
కాగా, అమ్మాయిల గొడవపై సింఘౌలి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో స్పందిస్తూ.. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఈ వీడియో ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, కారణం ఏంటో తెలుసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Video: Girls, in school uniform, exchange blows over ‘liking the same boy’ in UP#UttarPradesh #Baghpat https://t.co/dLrldBb8Db
— IndiaToday (@IndiaToday) January 2, 2025