సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 17, 2020 , 08:42:22

ఢిల్లీలో ఇద్దరు నేరస్థులు హతం

ఢిల్లీలో ఇద్దరు నేరస్థులు హతం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు ఎన్‌కౌంటర్‌ జరిగింది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు నేరస్థులను;ప్రహ్లాద్ పూర్ లో  పోలీసులు మట్టుబెట్టారు. క్రిమినల్స్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్రిమినల్స్‌ను రాజా ఖురేషి, రమేశ్‌ బహదూర్‌గా పోలీసులు గుర్తించారు. 


logo