ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమానాలు.. స్వదేశానికి 420 మంది విద్యార్థులు
Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు
విమానాలు న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి
వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 aircrafts) ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు.
#WATCH | Two C-17 Indian Air Force aircraft, carrying 210 Indian passengers each from #Ukraine, lands at their home base in Hindan near Delhi from Bucharest (Romania) & Budapest (Hungary).
MoS Defence Ajay Bhatt receives the students.#OperationGanga pic.twitter.com/WYolmwtOVi
— ANI (@ANI) March 4, 2022
ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటివరకు 6400 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో 7400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని తెలిపింది. ఇప్పటివరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ను వీడారని అధికారులు పేర్కొన్నారు.
భారతీయుల తరలింపునకు 30 విమాన సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి తరలిస్తున్నామని వెల్లడించారు. రానున్న 24 గంటల్లో 18 విమానాలు భారత్కు చేరుతాయన్నారు. కాగా, సుమి నగరంలో 7 వందల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని చెప్పారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

