న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు కరిచిచంపాయి. వసంత్‌కుంజ్‌కు సమీపంలోని సింధి క్యాంప్ ఏరియాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా నిరుపేద జనం ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.
అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో ఆనంద్ (7), ఆదిత్య (5) అనే ఇద్దరు చిన్నారులున్నారు. అయితే అన్నదమ్ములిద్దరూ మూడు రోజుల వ్యవధిలో వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం ఆ ఇంట్లో విషాదం నింపింది. గత శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆనంద్‌ను వీధి కుక్కలు కరిచిచంపాయి. ఈ ఘటనను మరువకముందే ఇవాళ మూత్ర విసర్జన చేసేందుకు ఇంటిముందుకు వచ్చిన ఆదిత్యపై వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి.