మదర్సాలో ఇద్దరు అబ్బాయిలను గొలుసులతో బంధించిన మౌలానా..
Madrasa | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మదర్సా (Madrasa) నుంచి పారిపోకుండా ఉండాలని ఇద్దరు అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి తాళాలు వేసిశాడు మౌలానా.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మదర్సా (Madrasa) నుంచి పారిపోకుండా ఉండాలని ఇద్దరు అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి తాళాలు వేసిశాడు మౌలానా. అయితే వారిని చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి పోలీసులకు చూయించడంతో ఈ అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది.
లక్నోలోని ఓ మదర్సాలో ఇద్దరు అబ్బాయిలను వారి తల్లిదండ్రులు చేర్పించారు. అయితే వారు అక్కడినుంచి పారిపోకుండా ఉండటానికి మౌలానా వారి కాళ్లను గొలుసులతో బంధించి తాళం వేశాడు. ఇది చూసిన ఓ వ్యక్తి వీడియోతీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మదర్సా నుంచి వారిని విడిపించారు. కాగా, మౌలానాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆ పిల్లల తల్లదండ్రులు పోలీసులకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
దీనంతటికీ తామే కారణమని, ఆ ఇద్దరికి చదువుకోవడం ఇష్టం లేదని.. దీంతో వారిపట్ల కఠినంగా ఉండాలని మౌలానాకు చెప్పామన్నారు. గతంలో వారు చదువుకోకుండా పారిపోవడానికి ప్రయత్నించారని, అందుకే ఆయన వారిని గొలుసులతో కట్టేశాడని పేర్కొన్నారు.
మదర్సాలో చదవడం తమకు ఇష్టం లేదని, అందుకే అక్కడి నుంచి పరారవడానికి ప్రయత్నించామని ఓ బాలుడు చెప్పారు. తాను ఓసారి టాయిలెట్లో కూడా దాక్కున్నానని మరో బాలుడు వెల్లడించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

