Victoria memorial వద్ద చక్కర్లు కొట్టిన డ్రోన్.. ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్ట్
Victoria Memorial | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. విక్టోరియా హాల్ వద్ద డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. విక్టోరియా హాల్ వద్ద డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది దానిని కూల్చివేశారు. దానిని ఆపరేట్ చేస్తున్న ఇద్దరు బంగ్లా దేశీయులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు డ్రోన్ కెమెరా సాహాయంతో విక్టోరియా మెమోరియల్, దాని పరిసరాలను ఫొటోలు తీస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహికి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. డ్రోన్‌ను ఎగురవేయడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు. రహస్యంగా ఫొటోలు తీయడం వెనుక కుట్ర ఏమైనా దాగిఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
విక్టోరియా మెమోరియల్ హాల్‌ను 1906-1921 మధ్యకాలంలో మ్యాకరీనా మార్బుల్స్‌తో నిర్మించారు. బ్రిటన్ రాణి విక్టోరియా గుర్తుగా అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ దీనిని నిర్మించారు. స్వాతంత్య్రానంతరం దానిని మ్యూజియంగా మార్చారు. ప్రస్తుతం అది కేంద్ర సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

