న్యూఢిల్లీ: మైనర్ రేప్, హత్య ఘటనలో బాధితురాలి బంధువుల ఐడెంటిటీని బయటపెట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు శనివారం ప్రకటించింది.
రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దాని పునరుద్ధరణకు కొంత టైం పడుతుంది. అప్పటి వరకు ప్రజల తరఫున, ప్రజల కోసం పోరాటం సాగిస్తూ ఇతర సోషల్ మీడియా వేదికలపై ఆయన తన వాణిని వినిపిస్తారు.. జై హింద్ అని కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
బుధవారం మైనర్ రేప్ హత్య ఘటనలో ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నారు. తర్వాత వారి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మ్రుతురాలి తల్లిదండ్రుల కన్నీళ్లు ఓ విషయం చెప్పాయి. వారి కూతురు ఈ దేశం పుత్రిక. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరుగాలి. అందుకోసం వారి పక్షాన నిలుస్తానని పేర్కొన్నారు.