న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు చివరిసారి, కఠినమైన హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐటీకి చెందిన సీనియర్ అధికారులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
కొత్త మధ్యవర్తిత్వ మార్గదర్శక నిబంధనలు గత నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు వీటిని అంగీకరించడానికి సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చింది. అయితే ట్విటర్ మాత్రం వీటికి ఇంకా అంగీకరించలేదు. ఇండియాలో చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ గ్రీవియెన్స్ ఆఫీసర్లను ట్విటర్ ఇంకా నియమించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Government of India gives final notice to Twitter for compliance with new IT rules. pic.twitter.com/98S0Pq8g2U
— ANI (@ANI) June 5, 2021