Crime news | ఇరవై ఏండ్ల వ్యక్తిని చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపిన 8 మంది మైనర్లు
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడి వీధిలో అందరూ చూస్తుండగానే ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మైనర్లు అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సఫ్దర్ జంగ్ ఆస్పత్రి వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడి వీధిలో అందరూ చూస్తుండగానే ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మైనర్లు అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సఫ్దర్ జంగ్ ఆస్పత్రి వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడాది క్రితం జరిగిన ఓ కొట్లాటే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి సంగమ్ విహార్ ఏరియాలో ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మంది మైనర్లు రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. రోడ్డుపై అతడిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు సఫ్ధర్‌జంగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎనిమిది మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా సంగమ్ విహార్కే చెందిన వారిగా గుర్తించారు. ఏడాది క్రితం జరిగిన ఒక కొట్లాటే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

