Vijay meets Prashant Kishor | ప్రశాంత్ కిషోర్‌ను కలిసిన విజయ్.. విమర్శించిన పలు పార్టీలు
Vijay meets Prashant Kishor | తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
చెన్నై: తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. (Vijay meets Prashant Kishor) కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది అలజడి రేపింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకేతో సహా విపక్ష పార్టీలు విమర్శించాయి. విజయ్ ఏసీ గదిలో కూర్చుని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ను కలవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎగతాళి చేశారు. దీనికి బదులు జనంలోకి వెళ్లి ప్రజలను కలిస్తే వారి బాధలు తెలుస్తాయని అన్నారు.
కాగా, వ్యూహకారుల పట్ల ఈ వ్యామోహం ఒక వ్యాధిగా మారిందని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) నేత సీమాన్ విమర్శించారు. ‘శరీరంలో కొవ్వు గురించి మీరు విని ఉండవచ్చు. కానీ ఇది డబ్బు వల్ల లావుగా మారుతుంది’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు గతంలో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేసిన అధికార డీఎంకే భిన్నంగా స్పందించింది. ఎన్నికల వ్యూహాల కోసం తమ పార్టీ కార్యకర్తలపై డీఎంకే ఆధారపడుతుందని ఎంపీ కనిమొళి తెలిపారు. ‘ప్రశాంత్ కిషోర్ ఒక ప్రొఫెషనల్ వ్యూహకర్త. ఆయనను ఎవరు పిలిచినా, వారితో కలిసి పనిచేస్తారు. దీనితో మనకు ఏం సంబంధం? డీఎంకే తన పార్టీ కార్యకర్తల బలంతో ఎన్నికలను ఎదుర్కొంటుంది. సీఎం స్టాలిన్ మనకు చూపించే మార్గం నాయకులంతా అనుసరించే మార్గం. మాకు ఎలాంటి సమస్యలు లేవు’ అని ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

