water tank tender | ఆరు గంటల్లో వాటర్ ట్యాంక్ టెండర్ ఖరారు.. విమర్శలతో రద్దు చేసిన టీవీకే ప్రభుత్వం
water tank tender | తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై మరో వివాదం తెరపైకి వచ్చింది. వాటర్ ట్యాంక్ టెండర్‌ను కేవలం ఆరు గంటల్లో ఖరారు చేయడంపై డీఎంకే మండిపడింది. విమర్శల నేపథ్యంలో ఆ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై మరో వివాదం తెరపైకి వచ్చింది. వాటర్ ట్యాంక్ టెండర్‌ను కేవలం ఆరు గంటల్లో ఖరారు చేయడంపై డీఎంకే మండిపడింది. విమర్శల నేపథ్యంలో ఆ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. (water tank tender) కాంచీపురం జిల్లాలో 30,000 లీటర్ల సామర్థ్యం గల ఎత్తైన నీటి ట్యాంకు నిర్మాణానికి గ్రామీణాభివృద్ధి శాఖ మే 19న టెండర్లను ఆహ్వానించింది. రూ.16.83 లక్షల విలువైన ఈ కాంట్రాక్టు వివరాలను ఆ రోజు ఉదయం 9 గంటలకు వెబ్సైట్లో ఉంచింది. బిడ్ సమర్పణ గడువు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలుగా నిర్ణయించారు. దీంతో టెండర్లో పాల్గొనేవారికి కేవలం ఆరు గంటల సమయం మాత్రమే లభించింది.
కాగా, ఈ టెండర్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తక్కువ వ్యవధిలో బిడ్డింగ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై డీఎంకే మండిపడింది. ఒక నిర్దిష్ట కంపెనీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ టెండర్‌ను రూపొందించినట్లు ఆరోపించింది.
మరోవైపు ఏదైనా కంపెనీ ఆరు గంటల్లోగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సిద్ధం చేసి, అన్ని లాంఛనాలను వాస్తవంగా ఎలా పూర్తి చేస్తుంది? అని డీఎంకే రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ అముతరసన్ ప్రశ్నించారు. ‘ఇది పరిపాలనా వేగం కాదు. ముందుగా ప్రణాళిక వేసుకున్న కాంట్రాక్ట్ రాజకీయాలు’ అని మంత్రి ఎన్. ఆనంద్‌ను విమర్శించారు. దీనిపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో పరిపాలన కారణాలు పేర్కొంటూ అదే రోజున ఆ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DMK
- flags
- planned process
- scraps
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

