TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ (Vijay) దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టిన ఆయన కేంద్రంలోని తాజాగా మరోసారి భారతీయ జనతాపార్టీపై నిప్పులు చెరిగారు. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న ఒకేదేశం – ఒకే ఎన్నిక విధానం (One Nation – One Election)అనేది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం లాంటిదేనని తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ అధినేత అన్నారు.
అరియళూర్ సభలో శనివారం రాత్రి పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్.. జనాభా ప్రతిపాదికన ఎంపీ సీట్ల కేటాయింపుతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక నినాదం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలని బీజేపీ అనుకుంటోంది. అనంతరం ఎన్నికలు నిర్వహించి లబ్ది పొందాలని ఆ పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో ఇష్టారీతిన అవకతవకలను పాల్పడవచ్చని కాషాయ పార్టీ నమ్ముతోంది. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని హత్యచేయడమే. ఇక డీలిమిటేషన్ (Delimitation) విధానం కూడా జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాల పాలిట శాపం కానుంది. ప్రతిపక్షాల బలాన్ని దెబ్బతీయాలనేది ఈ నిబంధంన అసలు ఉద్దేశం అని విజయ్ బీజేపీపై మండిపడ్డారు.
Reporter unfortunately reveals the Future🔥🔥#உங்கவிஜய்_நா_வரேன் pic.twitter.com/393Aka4tAp
— TVK Trends (@TVKTrendsVijay) September 13, 2025
బీహార్లో ఓట్ల చోరీకి పాల్పడి ఎన్నికల్లో గెలిచిన ఘనత ఆ పార్టీకే చెందుతుందని ఆయన విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో బీహార్లో దాదాపు 60 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సేందేని టీవేకే ప్రెసిడెంట్ అన్నారు. అంతేకాదు డీఎంకే ప్రభుత్వాన్ని కూడా ఆయన వదలలేదు. డీజిల్ ధరల తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు, విద్యార్థుల రుణాల ఎత్తివేత.. వంటి పలు ఎన్నికల హామీల అమలులో స్టాలిన్ సర్కారు విఫలం అయిందని విజయ్ పేర్కొన్నారు.