TVK chief Vijay: గవర్నర్‌కు లేఖ రాసిన విజయ్.. 15 రోజుల్లో బలనిరూపణ
TVK Chief Vijay: 108 సీట్లతో అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీగా టీవీకే నిలిచింది. దీంతో ఆ పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్‌కు లేఖ రాశారు. 15 రోజుల్లో బలనిరూపణ చేస్తానన్నారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. తమిళగ వెట్రి కజగం పార్టీ 108 సీట్లతో అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీగా నిలిచింది. దీంతో ఆ పార్టీ చీఫ్ విజయ్(TVK Chief Vijay) ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్‌కు లేఖ రాశారు. ఆయన అపాయింట్మెంట్ కోరారు. లోక్‌భవన్‌కు ఈమెయిల్ చేశారు. 108 స్థానాలతో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే సభలో తమ మెజారిటీని నిరూపించుకునేందుకు మరింత గడువును ఇవ్వాలని విజయ్ తన లేఖలో కోరినట్లు తెలుస్తోంది.
108 సీట్లు గెలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు హక్కు ఉందన్నారు. బలనిరూపణకు సమయం ఇవ్వాలని కోరుతున్నామని, 15 రోజుల్లో తమ సంఖ్యా బలాన్ని ప్రదర్శిస్తామన్నారు. అయితే విజయ్‌కు త్వరలోనే గవర్నర్ ఆహ్వానం పంపనున్నట్లు లోక్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. బల నిరూపణకు ఏడు నుంచి 15 రోజుల సమయం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మెజారిటీ మార్క్. అయితే ఆ సంఖ్యకు మరో 10 సీట్ల దూరంలో టీవీకే ఆగిపోయింది. దీంతో ఎవరు టీవీకేతో పొత్తు పెట్టుకుంటారో ఆసక్తికరంగా మారింది. టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

