ముజాఫర్‌పుర్: బీహారీ ప్రజలు గొప్పగా జరుపుకునే ఛాట్ పూజకు .. యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ముజాఫర్‌పుర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఎంతో సంతోషంగా బీహారీ ప్రజలు ఛాట్ పూజను జరుపుకుంటారని, ఆ పండుగను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నదని, కానీ తమ ప్రభుత్వం ఛాట్ పూజకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తునదన్నారు. ఓట్ల కోసం ఛాట్ ఉత్సవాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ అవమానిస్తున్నదన్నారు. రైల్వేను లూటీ చేసినవాళ్లు.. బీహార్ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేస్తారని అన్నారు. బీహార్‌లో జంగిల్‌రాజ్ నడిచిందని, ఆర్జేడీ గుండాలు షోరూమ్‌లకు వెళ్లి వాహనాలను ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు.
#WATCH | Muzaffarpur, Bihar: Prime Minister Narendra Modi says, “… This is my first public rally after the Chhath Puja… Our government is trying to secure UNESCO Intangible Cultural Heritage status for the Chhath Mahaparva…” pic.twitter.com/PpwHtpWQVW
— ANI (@ANI) October 30, 2025