మహిళను ఢీకొట్టి 3 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ట్రక్కు..
Uttar pradesh | దేశ రాజధాని ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకున్నది. యూపీలోని బాందా జిల్లా
లక్నో: దేశ రాజధాని ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకున్నది. యూపీలోని బాందా జిల్లా మావాయ్ బజ్‌రంగ్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ట్రక్కు ఢీకొట్టింది.. అనంతరం ఆమెను 3 కిలోమీటర్ల మేర లాక్కెల్లింది.
లక్నోకు చెందిన పుష్ప దేవి.. బజ్రంగ్లోని బీకే గుప్తా యూనివర్సిటీలో క్లర్క్‌గా పనిచేస్తున్నది. నిత్యావసరాల కోసం బుధవారం రాత్రి ఆమె తన స్కూటర్‌పై వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌తోపాటు ఆమె ట్రక్కు చాసిస్‌లో చిక్కుకుపోయింది. అయినప్పటికీ డ్రైవర్ ఆపకుండా అలానే వెళ్లడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. తోటి వాహనదారులు లారీని వెంబడించినప్పటికీ డ్రైవర్ ఆపకుండానే 3 కిలోమీటర్ల మేర లాక్కెల్లాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రక్కును అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మహిళను లారీ కిందిని తీశామని, అయితే అప్పటికే ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Uttar Pradesh | A lady govt officer died on the spot, in Banda district, after her two-wheeler vehicle was hit by a truck & got stuck into it. The vehicle was dragged after being stuck in the truck due to which a fire broke out in the truck: ASP Banda pic.twitter.com/cLSIMBrH6J
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

