Gurugram | హర్యాణా రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గురుగ్రామ్ (Gurugram)లో కేవలం 12 గంటల వ్యవధిలో 133 మి.మీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లపైకి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఈ వర్షం కారణంగా పెరిఫెరల్ రోడ్డు (Peripheral Road)లో ఓ చోట రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న ఓ ట్రక్కు గుంతలో ఇరుక్కుపోయింది (Truck Falls Into Ditch). దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రంగంలోకి దిగిన అధికారులు ట్రక్కును అక్కడి నుంచి తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
#WATCH | A truck has been stuck in a ditch at Gurugram’s Southern Peripheral Road since last night. The ditch was formed when a part of the road caved in while the truck was travelling on it. pic.twitter.com/8qZbpQ9gWf
— ANI (@ANI) July 10, 2025
Also Read..