Z Shaped Overbridge | మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్.. ఇప్పుడు Z-ఆకారంలో వంతెన నిర్మాణం..!
Z Shaped Overbridge | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో Z ఆకారంలో ఉన్న మరో వంతెన వెలుగులోకి వచ్చింది.
Z Shaped Overbridge | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ (Bhopal)లో నిర్మించిన 90 డిగ్రీల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (90 degree flyover), పాములా మెలికలు తిరిగిన (snake like bridge) వంతెన ఇటీవలే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి విషయం తెలిసిందే. తాజాగా ఇండోర్ (Indore)లో Z ఆకారంలో ఉన్న మరో వంతెన వెలుగులోకి వచ్చింది.
పోలో గ్రౌండ్ సమీపంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ Z-ఆకారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిను (Z Shaped Railway Overbridge) నిర్మిస్తోంది. లక్ష్మీబాయి నగర్‌ను భగీరత్‌పుర, MR-4 ద్వారా పోలో గ్రౌండ్‌కు అనుసంధానంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఈ వంతెనలో రెండు చోట్ల 90 డిగ్రీల మలుపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మలుపులు ప్రమాదాలకు కేంద్రంగా మారుతాయని స్థానిక డ్రైవర్లు, పారిశ్రామిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
90 డిగ్రీల మలుపుతో వంతెన నిర్మాణం..
భోపాల్‌లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లో 90 డిగ్రీల మలుపు (90 Degree Flyover) ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనిపై ప్రయాణించే వాహనాలు ఒకేసారి 90 డిగ్రీల మలుపు తిరిగితే, ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోపాల్‌లోని ఐష్బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సుదీర్ఘ సమయం వేచి ఉండవలసిన అవసరాన్ని నివారించడం కోసం ఈ వంతెనను నిర్మించారు.
దీనివల్ల మహామాయి కా బాగ్, పుష్ప నగర్, స్టేషన్ ఏరియా వారికి ప్రయోజనం కలుగుతుంది. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే మూడు లక్షల మందికి ఈ వంతెన ఉపయోగకరం. ప్రయాణానికి పట్టే సమయం తగ్గుతుందని, ట్రాఫిక్ అంతరాయాలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. . ప్రజా పనుల శాఖలోని వంతెనల శాఖ చీఫ్ ఇంజినీరు వీడీ వర్మ మాట్లాడుతూభూమి తగినంత అందుబాటులో లేనందువల్ల మరో అవకాశం లేకపోయిందని, ఈ వంతెనపై నుంచి చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. రెండు కాలనీలను అనుసంధానం చేయడానికే ఈ వంతెనను నిర్మించినట్లు తెలిపారు. వాహనాల వేగాన్ని పరిమితం చేస్తామన్నారు.
పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్..
భోపాల్‌లోని సుభాష్ నగర్లో రెండేళ్ల కిందట ఈ పాములా మెలికలు తిరిగిన (snake like bridge) రైల్వే ఓవర్ బిడ్జిని (Subhash Nagar Railway Over Bridge) నిర్మించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ వంతెన నిర్మాణంలో ఇంజినీర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వంతెనపై డివైడర్లు సైతం సరిగా లేవు. అంతేకాదు కేవలం ఎనిమిది గంటల్లోనే రెండు ప్రమాదాలు సంభవించాయి. దీంతో దీని నిర్మాణం, భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సుభాష్ నగర్ ఆర్వోబీ మైదా మిల్లు-ప్రభాత్ పెట్రోల్ పంప్ మధ్య కీలక లింక్‌గా ఇది ఉంది. భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జి ట్రాఫిక్ రద్దీని తగ్గించినప్పటికీ.. ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలు బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదకరమైన లోపాలను బహిర్గతం చేశాయి. ఈ బ్రిడ్జి మెలికలు తిరిగి ఉండటంతో.. వాహనాలు కొన్ని నిమిషాల్లోనే పలుమార్లు మెలికలు తిరిగాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో ఈ బ్రిడ్జిపై ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎంత నిదానంగా వెళ్లినప్పటికీ.. మలుపుల వద్ద నియంత్రణకోల్పోయి ప్రమాదాల బారినపడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Europe Court | మలేషియా విమానాన్ని కూల్చింది రష్యానే : యూరప్ కోర్టు
Shubhanshu Shukla | అంతరిక్షంలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మెంతి, పెసర విత్తనాలు పెంచుతూ..
Earthquake | ఢిల్లీలో స్వల్ప భూకంపం.. హర్యానా, రాజస్థాన్, యూపీలోని ప్రకంపనలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

