Wild Animals | పులులు, ఏనుగులను తరలిస్తున్న ట్రక్కు బోల్తా.. రోడ్డుపై పడిన మొసళ్లు
Wild Animals | పులులు, ఏనుగులు వంటి జంతువులను (Wild Animals) తరలిస్తున్న ఓ ట్రక్కు బోల్తాపడింది.
Wild Animals | పులులు, ఏనుగులు వంటి జంతువులను (Wild Animals) తరలిస్తున్న ఓ ట్రక్కు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అందులోని ప్రాణులన్నీ సురక్షితంగా బయటపడ్డాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.
బీహార్ రాజధాని పట్నా (Patna)లోని సంజయ్‌గాంధీ జాతీయ జూ పార్కు (Sanjay Gandhi Biological Park) నుంచి వివిధ రకాల జంతువుల్ని రెండు వాహనాల్లో బెంగళూరులోని బన్నేర్‌గట్ట జాతీయ పార్కు (Bannerghatta National Park)కు తరలిస్తున్నారు. వీటిల్లో ఎనిమిది మొసళ్లు (Crocodiles), రెండు తెల్ల ఏనుగులు, రెండు తెల్ల పులులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. అయితే, నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామానికి చేరుకోగానే ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి సిమెంట్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. దీంతో వాహనం రోడ్డు పక్కకు బోల్తాపడిపోయింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మొసళ్లలో రెండు బయటపడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిపోయిన మొసళ్లను తిరిగి పట్టుకున్నారు. అనంతరం మరో వాహనాన్ని ఏర్పాటుచేసి అన్నింటినీ బెంగళూరు తరలించారు.
Also Read..
Salman Khan | సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
Nayab Singh Saini | హర్యానాలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం.. సీఎంగా సైనీ ప్రమాణం
Meta Layoffs | ఉద్యోగులకు షాక్.. మెటా మరోసారి లేఆఫ్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

